కృతి శెట్టి పక్కన హీరోగా చచ్చినా నటించను అంటున్న తమిళ స్టార్

by Bhoopathi Nagaiah |

యూనిక్ స్టైల్‌లో కెరీర్ కొనసాగిస్తున్న సౌత్ ఇండియన్ స్టార్స్‌లో విజయ్ సేతుపతి ఒకడు.

కృతి శెట్టి పక్కన హీరోగా చచ్చినా నటించను అంటున్న తమిళ స్టార్
X

దిశ, సినిమా: యూనిక్ స్టైల్‌లో కెరీర్ కొనసాగిస్తున్న సౌత్ ఇండియన్ స్టార్స్‌లో విజయ్ సేతుపతి ఒకడు. ఎలాంటి పాత్రలో నటించడానికైనా ముందుండే ఆయన.. ‘ఉప్పెన’ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టికి తండ్రి‌గా కనిపించి మెప్పించాడు. ఈ మూవీతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం కృతి శెట్టికి విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న తాజా సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ అమ్మాయికి తండ్రిగా నటించిన తాను బాయ్‌ఫ్రెండ్‌గా నటించనని దర్శక, నిర్మాతలకు చెప్పాడట. ఆమె కాకుండా మరొకరిని హీరోయిన్‌గా తీసుకోవాలని సూచించాడట.

Next Story