- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్-రష్మిక మందన్న పెళ్లి కార్డ్ వైరల్.. కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్
విజయ్, రష్మికి పెళ్లి కార్డ్ నెట్టింట సంచలనంగా మారింది.

దిశ, సినిమా: టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక(Rashmika Mandanna) పెళ్లికి సిద్ధమైనట్లు గత రెండు మూడు నెలలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ఇద్దరు సైలెంట్‌గా ఉన్నప్పటికీ పలు విషయాలపై మాత్రం హింట్ ఇస్తున్నారు. సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి విషయంలోనూ ఆ సీక్రెట్‌ను మెయింటైన్ చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, విజయ్, రష్మికి పెళ్లికి సంబంధించిన కార్డ్ నెట్టింట సంచలనంగా మారింది. వెడ్డింగ్ కార్డ్ ప్రకారం వీరిద్దరు ఫిబ్రవరి 26న అత్యంత సన్నిహితుల సమక్షంలో ఒక్కటి కాబోతున్నారట. సంప్రదాయబద్దంగా.. జరనున్న ఈ పెళ్లి వేడుక రాజస్థాన్‌లో జరగబోతుంది.
ఇక పెళ్లి అనంతరం.. హైదరబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం మార్చి 4న సాయంత్రం 7గంటలకు తాజ్ కృష్ణ హోటల్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ వేడుకలు జరగనున్నాయి. విజయ్ దేవరకొండ తన పేరు మీద ఈ ఆహ్వాన పత్రికను పంపిస్తూ తన కొత్త జీవిత ప్రయాణానికి అందరి ఆశీస్సుతు కావాలని కోరుతున్నారు. ఇప్పటికే ఈ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా మారిన విజయ్, రష్మిక వీడియోలు వైరల్ కావడం, రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ విషయం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇక ఇప్పుడు ఏకంగా వీరిద్దరి పెళ్లి కార్డ్ లీక్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కంగ్రాట్స్ అంటూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.






