పెళ్లి చేసుకున్న విజయ్- రష్మిక.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు.. ఫుల్ హ్యాపీలో ఫ్యాన్స్

by I. Sairam |

టాలీవుడ్ రూమర్ కపుల్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌(Vijay Devarakonda)- ర‌ష్మిక మంద‌న్నా(Rashmika Mandanna) గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

పెళ్లి చేసుకున్న విజయ్- రష్మిక.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు.. ఫుల్ హ్యాపీలో ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ రూమర్ కపుల్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌(Vijay Devarakonda)- ర‌ష్మిక మంద‌న్నా(Rashmika Mandanna) గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వీరిద్ద‌రు ఆన్‌స్క్రీన్ ‘గీతా గోవిందం’(Geetha Govindam), డియర్ కామ్రెడ్(Dear Comrade) వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. దీంతో ఆఫ్‌స్క్రీన్‌లోను వీరిద్దరు లవ్‌లో ఉన్నారని గత కొన్నాళ్లుగా ఓ రూమర్ నెట్టింట షికారు చేస్తుంది. ఈ జంట ఫెస్టివల్స్‌ని కలిసే సెలబ్రేట్‌ చేసుకోవ‌డం, వెకేష‌న్స్‌కి క‌లిసే వెళ్ల‌డం, ఇద్ద‌రిలో ఎవ‌రి బ‌ర్త్ డే అయిన కూడా ఏదో వెకేష‌న్‌కి వెళ్లి అక్క‌డే క‌లిసి సెల‌బ్రేట్ చేసుకోవ‌డం కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం.

అయితే వీరిద్ద‌రి రిలేష‌న్ గురించి నెట్టింట అనేక ప్ర‌చారాలు సాగుతున్నా ఏ రోజు దానిపై వారు క్లారిటీ ఇవ్వ‌లేదు. తమ ప్రేమ గురించి క్లూ ఇస్తుంటారే త‌ప్ప అఫీషియ‌ల్‌గా మాత్రం ప్ర‌క‌టించరు. రీసెంట్‌గా కూడా వీరిద్దరు ఒకే కారులో దర్శనమివ్వడంతో దాదాపు అందరూ కూడా కన్ఫర్మ్ అయిపోయారు వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారని. ఈ క్రమంలో ఈ జంటకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

వైరల్ అవుతున్న ఫొటోలో రష్మిక- విజయ్‌లు మ్యారేజ్ చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. మెడలో పూల దండలతో దర్శనమిచ్చారు. అంతేకాకుండా రష్మిక పెళ్లి కూతురిలా విజయ్ పెళ్లి కొడుకులా ముస్తాబయి ఉన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ నిజంగానే చేసుకున్నారా అని ఫుల్ హ్యాపీ అవుతున్నారు. మరికొంత మంది ఇది నిజం అయితే చూడాలని ఎప్పటినుంచో డ్రీమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఫొటోస్‌పై ఈ జంట స్పందిస్తుందేమో చూడాల్సి ఉంది.

Next Story