కొత్త ప్రాజెక్ట్‌తో వచ్చేస్తున్న విజయ్.. టైటిల్ కూడా ఫిక్స్!

by Disha Web Desk 7 |
కొత్త ప్రాజెక్ట్‌తో వచ్చేస్తున్న విజయ్.. టైటిల్ కూడా ఫిక్స్!
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం.. ఆడియన్స్‌ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం ఇది ఓటీటీలో సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘రాజా వారు రాణి గారు’ ఫేమ్ డైరెక్టర్ కిరణ్ కోలా విజయ్ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందబోతున్న ఈ మూవీని దిల్ రాజు గ్రాండ్‌గా నిర్మించబోతున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకు ‘రౌడీ జనార్దన్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. అయితే.. దీనిపై ఈ మే 9 న అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Read More...

సిగ్గులేకుండా నగ్నంగా ఉండి ఆ సీన్ చేశానంటూ.. అమీర్ ఖాన్ వైరల్ కామెంట్స్

Next Story

Most Viewed