స్టార్ పవర్ అంటే ఇదే.. ‘జననాయగన్’ ఈవెంట్‌తో విజయ్ సరికొత్త రికార్డు!

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-30 05:39:09  IST  )

తమిళ స్టార్ హీరో విజయ్(Thalapathy Vijay) మరోసారి తన అపారమైన క్రేజ్‌ను నిరూపించుకున్నారు.

స్టార్ పవర్ అంటే ఇదే.. ‘జననాయగన్’ ఈవెంట్‌తో విజయ్ సరికొత్త రికార్డు!
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో విజయ్(Thalapathy Vijay) మరోసారి తన అపారమైన క్రేజ్‌ను నిరూపించుకున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘జననాయగన్’(Jananayagan) మూవీకి సంబంధించిన ఈవెంట్ డిసెంబర్ 27న మలేషియాలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏకంగా 85 వేల మందికి పైగా అభిమానులు హాజరుకావడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఒక సినిమా ఈవెంట్‌కు ఇంత భారీ సంఖ్యలో జనసమూహం రావడం అరుదైన విషయం. ఈ భారీ హాజరుతో ‘జననాయగన్’ ఈవెంట్ అధికారికంగా మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌(Malaysia Book of Records)లో స్థానం సంపాదించుకుంది. ఒక భారతీయ నటుడి సినిమా ఈవెంట్‌కు ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు చేరడం అక్కడి రికార్డుల చరిత్రలోనే ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. దీంతో విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతర్జాతీయ స్థాయిలో ఎంత బలంగా ఉందో మరోసారి స్పష్టమైంది. ఇది కేవలం ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమం కాకుండా, విజయ్ అభిమానుల కోసం ఒక భావోద్వేగ వేడుకలా మారింది.

ఇక సోషల్ మీడియాలో ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇది సినిమా ఈవెంట్ కాదు.. ఒక ఉద్యమం, విజయ్ అంటే క్రేజ్ కాదు, బ్రాండ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా 85 వేల మంది హాజరు అనే సంఖ్య అభిమానుల్లో మరింత గర్వాన్ని నింపుతోంది. మొత్తానికి జననాయగన్ ఈవెంట్‌తో దళపతి విజయ్ మరోసారి తన స్టార్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించారు. సినిమా విడుదలకు ముందే ఈ స్థాయిలో హైప్ క్రియేట్ కావడం, రికార్డులు నమోదు కావడం విజయ్ క్రేజ్‌కు నిదర్శనం. కాగా.. ఈ సినిమా విజయ్ కెరీర్ చివరి ప్రాజెక్ట్ కావడం విశేషం. త్వరలో ఆయన పాలిటిక్స్‌లో బిజీ అయిపోనున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, ప్రియమణి,మమిత బైజు కీలక పాత్రలో కనిపించనున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read More..

ప్రభాస్, పవన్‌ల నిజ స్వరూపం బయటపెట్టిన సుమ.. షాకింగ్ విషయాలు రివీల్ !

Next Story