- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి తర్వాత ఊహించని ట్విస్ట్ ఇచ్చిన విజయ్.. ఎవరు ప్రపోజ్ చేశారో చెప్పడంతో ఫ్యాన్స్ షాక్!
మా రెండో సినిమా ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్ సమయంలో మా మధ్య ప్రేమ చిగురించింది.

దిశ, సినిమా: టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ కపుల్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna)పెళ్లి తర్వాత కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఫిబ్రవరి 26న ఒక్కటైన ఈ జంట, తాజాగా తమ ప్రేమ కథలోని అసలు సీక్రెట్‌ను బయటపెట్టారు. చాలా కాలం పాటు తమ రిలేషన్‌షిప్‌ను సీక్రెట్‌గా ఉంచిన ఈ జంట, పెళ్లి తర్వాత మొదటిసారి తమ ప్రేమ ప్రయాణం గురించి నోరు విప్పారు. విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘మా మొదటి సినిమా ‘గీత గోవిందం’ చేస్తున్నప్పుడు మేము కేవలం కలిసి పనిచేసే కోస్టార్స్ మాత్రమే. ఆ తర్వాత నెమ్మదిగా మంచి స్నేహితులమయ్యాము. మా రెండో సినిమా ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్ సమయంలో మా మధ్య ప్రేమ చిగురించింది.
అయితే అందరూ అనుకున్నట్టు నేను కాకుండా, రష్మికనే నాకు మొదట ప్రపోజ్ చేసింది’’ అని బాంబు పేల్చారు. విజయ్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రష్మికనే ముందుగా ప్రపోజ్ చేసిందన్న విషయం తెలిసి ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. అంతా విజయ్ ప్రపోజ్ చేసాడనుకుంటే.. మొత్తానికి రష్మిక ట్విస్ట్ ఇచ్చిందని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ ప్రపోజల్ మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టడం విశేషం. ఇక నిన్ననే విజయ్ తన సొంత ఊరిలో సత్యనారాయణ వ్రతం చేసుకుని, అభిమానులకు విందు భోజనం వడ్డించిన సంగతి తెలిసిందే. నేడు (మార్చి4న) ఘనంగా.. వీరిద్దరి రిసెప్షన్ వేడుక జరగబోతోంది. ఇక ఈవెంట్‌లో సినీ సెలబ్రిటీలతో పాటు, రాజకీయ నాయకులు కూడా పాల్గొనబోతున్నారు.






