నటితో డేటింగ్.. గర్ల్‌ఫ్రెండ్‌తో ఎక్కువ సమయం గడపాలని ఉందంటూ విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ‘కింగ్‌డమ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

నటితో డేటింగ్.. గర్ల్‌ఫ్రెండ్‌తో ఎక్కువ సమయం గడపాలని ఉందంటూ విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ‘కింగ్‌డమ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించింది. సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 31న థియేటర్స్‌లో రాబోతుంది. ఈక్రమంలో.. ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా, విజయ్ దేవరకొండ రిలేషన్‌షిప్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

‘‘ప్రపంచంలో అన్నింటికంటే ముఖ్యమైనవి మానవ సంబంధాలు. గత రెండేళ్ల నుంచి వాటి గురించి బాగా అర్థం అయింది. రెండు మూడేళ్ల నుంచి నా జీవితం నాకు నచ్చలేదు. కుటుంబం, ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్ ఎవరికీ సమయాన్ని కేటీయించలేదు. ఈ విషయాన్ని గ్రహించాక నా పద్ధతి మార్చుకున్నా. ఇప్పటి నుంచి నా వాళ్ల కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాను. వాళ్లందరితో కలిసి విలువైన టైమ్‌ను అస్వాదిస్తాను. ప్రేమించబడటం అంటే ఏమిటో నాకు తెలుసు. అది షరతులు లేనిదో కాదో నాకు తెలియదు ఎందుకంటే నా ప్రేమ అంచనాలతో వస్తుంది. బహుశా అది నా అజ్ఞానం వల్ల కావచ్చు. ప్రేమలో షరతులు పెట్టడం సరైందేనని నేను భావిస్తున్నాను. నేను ఇంతకు ముందు ఒక సహ నటితో డేటింగ్ చేశాను.

నాకు 35 ఏళ్లు, నేను ఒంటరిగా ఉంటానని మీరు అనుకుంటున్నారా? కావచ్చు. మనమందరం ఏదో ఒక సమయంలో పెళ్లి చేసుకోవాలి కాబట్టి నేను కూడా చేసుకుంటాను. అసలు వివాహం చేసుకోకూడదు ఏం నిర్ణయించుకోలేదు” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రష్మిక గురించే అంటున్నారు. గత కొద్ది కాలంగా వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు ఎన్నో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిత్యం పలు వేకెషన్స్‌కు కూడా వెళ్తంటారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అంతా ఫిక్స్ అయిపోయారు. ఈక్రమంలోనే విజయ్ అలాంటి కామెంట్స్ చేయడంతో అంతా షాక్ అవుతున్నారు.

Next Story