Vijay Devarakonda : ఆ ఒక్కటే పెండింగ్‌.. త్వరలోనే నెరవేరుస్తానంటున్న .. విజయ్ దేవరకొండ

by Phanindra |   (  Updated:2023-02-16 08:33:28  IST  )

రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలోనే అభిమానుల అంచనాలు అందుకుంటానంటున్నాడు.

Vijay Devarakonda : ఆ ఒక్కటే పెండింగ్‌.. త్వరలోనే నెరవేరుస్తానంటున్న .. విజయ్ దేవరకొండ
X

దిశ, సినిమా : రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలోనే అభిమానుల అంచనాలు అందుకుంటానంటున్నాడు. ఇటీవల వచ్చిన సినిమాలు అపజయాలపాలవడంతో తనతోపాటు ఫ్యాన్స్ కూడా కాస్త ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలోనే తన ఫాలోవర్లను డిజాప్పాయింట్ చేయకుండా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా, తదితర వేదికల్లో అలరిస్తున్న హీరో.. తాజాగా ట్విట్టర్ వేదికగా వాళ్లతో ముచ్చటిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ మేరకు 'ఎప్పటికీ మరిచిపోలేని ఒక పెద్ద హిట్ ఇవ్వు అన్నయ్య' అని ఓ నెటిజన్ కోరగా పాజిటివ్‌గా స్పందించిన నటుడు.. 'ఆ ఒక్కటే పెండింగ్‌రా.. త్వరలోనే కొట్టేద్దాం' అంటూ అభిమానులను ఉత్సాహపరిచేలా మాట్లాడాడు. దీంతో త్వరలో రాబోయే 'ఖుషీ' మూవీతో తమ హీరో బిగ్ హిట్ కొడతాడంటూ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి: వెంకీ కాలర్ పట్టుకున్న రానా.. రెండు ఫ్యామిలీస్ మధ్య వార్..!

Next Story