సూపర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ సినిమాను ఒకే చేసిన విజయ్ దేవరకొండ.. కలిసొచ్చేనా?

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు.

సూపర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ సినిమాను ఒకే చేసిన విజయ్ దేవరకొండ.. కలిసొచ్చేనా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పటికే షూటింగ్స్‌లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్న విజయ్ దేవరకొండ మరో సినిమాను ఒప్పుకున్నట్లు సమాచారం. మనం, ఇష్క్, గ్యాంగ్ లీడర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న విక్రమ్ కె కుమార్(Vikram K Kumar) దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నట్లు టాక్. ఆయన ఓ కథ చెప్పడంతో అది విజయ్‌కి నచ్చిందని నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఈ కాంబో గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి బజ్ నెలకొంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించబోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు విక్రమ్ కుమార్ స్టోరీ టెల్లింగ్, స్టైల్ ఎమోషనల్ డ్రామా, సైన్స్, ఫిక్షన్ ఎలిమెంట్స్, విజయ్ ఎనర్జిటిల్ యాక్టింగ్‌ కలిస్తే మ్యాజిక్ జరుగుతుందని అంటున్నారు. కాగా, విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రౌడీ జనార్థన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. రవి కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

Next Story