సమంత గురించి మాట్లాడుతూ ఆల్మోస్ట్ కన్నీరు పెట్టుకున్న విజయ్ దేవరకొండ

by Disha Web Desk 2 |
సమంత గురించి మాట్లాడుతూ ఆల్మోస్ట్ కన్నీరు పెట్టుకున్న విజయ్ దేవరకొండ
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన తాజా చిత్రం ఖుషి. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. సెప్లెంబర్ 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ పనుల్లో బిజీ అయిపోయారు. తాజాగా.. మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర మ్యూజికల్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘షూటింగ్ సాఫీగా సాగుతున్న సమయంలో ఒక విషయం తెలిసింది. సమంతకు హెల్త్ బాలేదని తెలిసి అందరం షాక్ అయ్యాం. మూడు రోజులు షూటింగ్ ఆపేస్తే సెట్ అవుతుందని భావించాం.. కానీ, అసలు సమస్య ఏంటో ఆ తర్వాత అర్ధం అయింది. సామ్ చాలా డెడికేటేడ్ యాక్ట్రస్. సమంత కోసమైనా ఈ చిత్రం పెద్ద విషయం కావాలి. చివరగా అభిమానులకు అందించిన హిట్ ఏంటో కూడా నాకు గుర్తు లేదు. కానీ చాలా ఖచ్చితంగా చెబుతున్నాను ఈ సినిమా అందరినీ అలరిస్తుంది. సెప్టెంబర్ 1న అందరి మొహంలో చిరునవ్వు చూడాలని ఉంది.’ అని విజయ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

Read More : Samantha Latest Photo Gallery



Next Story

Most Viewed