- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర అనారోగ్యానికి గురైన విజయ్ దేవరకొండ.. ఆస్పత్రిలో చేరడంతో ఆందోళన చెందుతున్న అభిమానులు!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న రౌడీ హీరో అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందోనని ఆందోళన చెందుతున్నారు.కాగా, విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే.. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom).
గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జులై 31న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈక్రమంలో.. విజయ్ దేవరకొండకు జ్వరం రావడంతో ఆయన అభిమానులు అయోమయంలో పడిపోయారు. ప్రమోషన్స్ చేయాల్సిన సమయంలో ఇలా జరగమేంటని విచారం వ్యక్తం చేస్తున్నారు.






