Vijay Devarakonda : స్టార్స్ సినిమాలు నోరు మూసుకుని చూడాలి సంచలన కామెంట్స్...

by Disha Web Desk 7 |
Vijay Devarakonda : స్టార్స్ సినిమాలు నోరు మూసుకుని చూడాలి సంచలన కామెంట్స్...
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం విజయ్ దేశరకొండ ‘ఖుషి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న విజయ్.. స్టార్ హీరోలు చిరంజీవి, రజినీకాంత్ సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమా డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మెగాస్టార్‌పై నెట్టింట తీవ్రంగా నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. దీనిపై మీ స్పందన ఏంటి అని రిపోర్టర్ విజయ్‌ను ప్రశ్నించగా.. ‘‘సూపర్ స్టార్స్ అయిన రజినీకాంత్, చిరంజీవి సినిమాలకు హిట్స్, ఫ్లాప్స్ ఏం ఉండవు. రజనీకాంత్ 5, 6 సినిమాలు ఫ్లాప్ అయిన.. జైలర్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అలాగే చిరంజీవి కూడా వరుస ఫ్లాప్స్ వచ్చినప్పటికీ వారు హిట్ కొట్టి ముందుకు వచ్చేందుకు ఒక్క సినిమా చాలు. సరైన దర్శకుడు చిరంజీవి సత్తాను సరిగ్గా ఉపయోగించుకుంటే సెన్సేషనల్ హిట్‌తో తిరుగొస్తారు. ఆయన వచ్చేకే చిత్ర పరిశ్రమ చాలా మారింది. సినిమాల్లోకి రావడానికి చిరంజీవి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. కాబట్టి మనం సినిమాలు నోరు మూసుకుని చూడాలి. హిట్స్, ఫ్లాప్స్‌ ఆధారంగా నటులను జడ్జ్ చుయవద్దు’’ అంటూ విజయ్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి: 8 ప్యాక్స్ అబ్స్‌తో పిచ్చెక్కించిన వరుణ్ ధావన్.. మాటల్లేవ్ పడిపోయానంటున్న బోల్డ్ బ్యూటీ

Next Story