8 ప్యాక్స్ అబ్స్‌తో పిచ్చెక్కించిన Varun Dhavan.. మాటల్లేవ్ పడిపోయానంటున్న బోల్డ్ బ్యూటీ

by Disha Web Desk |
8 ప్యాక్స్ అబ్స్‌తో పిచ్చెక్కించిన Varun Dhavan.. మాటల్లేవ్ పడిపోయానంటున్న బోల్డ్ బ్యూటీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీర్ వరుణ్ ధావన్ వాష్‌బోర్డ్ అబ్స్‌తో అట్రాక్ట్ చేశాడు. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ‘బవాల్‌’తో చివరిసారిగా అభిమానులను అలరించిన ఆయన.. తదుపరి ప్రాజెక్టు కోసం తెగ కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే సూపర్ బిల్ట్, టోన్డ్ బాడీని మెయింటైన్ చేస్తూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్న వరుణ్.. ఇప్పుడు మరింత డోస్ పెంచాడు. తాజాగా జిమ్‌లో 8 ప్యాక్ అబ్స్‌ని చూపిస్తూ మిర్రర్ సెల్ఫీలు తీసుకున్న ఫొటోలను నెట్టింట పోస్ట్ చేశాడు. ‘సమ్ BTS పిక్స్. ఇప్పుడు ఈ ఆకారం లేదు కానీ అక్కడికి చేరుకుంటుంది’ అంటూ దీనికి క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు. ప్రస్తుతం వరుణ్ ఫిట్‌నెస్‌ను చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. ‘భేడియా 2 లోడింగ్’ అంటూ పొగిడేస్తున్నారు. అలాగే నటి భూమి పెడ్నేకర్ స్పందిస్తూ ‘జూనో’ అని పిలవగా.. హీరో బాడీ బిల్డ్‌ని మెచ్చుకోవడానికి పదాలు సరిపోవు అంటూ దిశా పఠానీ ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి: Vijay Devarakonda : స్టార్స్ సినిమాలు నోరు మూసుకుని చూడాలి సంచలన కామెంట్స్...

Next Story

Most Viewed