- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్‌డెస్క్: మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎట్టకేలకు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జన గణ మన'ను స్టార్ట్ చేసేశాడు. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందంటూ పూరినే చెప్పాడు. దీంతో ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. ఈ మూవీలో విజయ్ హీరోగా కాగా, హీరోయిన్‌గా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌ను ఓకే చేశాడట. తాజాగా ఈ సినిమా గురించి మరో న్యూస్ సోషల్ మీడియాను చుట్టేస్తోంది. ఈ మూవీలో విజయ్ ఓ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడట. 'సెలవులకు ఊరు వచ్చిన ఆర్మీ ఆఫీసర్ తన ఊళ్లోని అవినీతిని చూసి అక్కడి వారిని ఎలా మార్చాడు' అనేది మూవీ స్టోరీ అని, అందులో ఆర్మీ జవానుగా విజయ్ కనిపించనున్నాడంటూ నెట్టింట వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. వీటికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయనున్నారట. మరి ఈ అప్‌డేట్‌ను పూరి ఎప్పుడిస్తాడో చూడాలి.
Next Story






