- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Nani - Vijay Devarakonda: ఇకపై నానిని అన్న అని పిలుస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ
దిశ, వెబ్ డెస్క్: హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు ఈ రౌడీ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్ చేసే హంగామ అంతా ఇంతా కాదు. నాని హీరోగా తెరకెక్కిన ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతోనే విజయ్ కు మంచి పేరొచ్చింది. ఆ మూవీలో వారిద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత విజయ్ హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.
విజయ్ హీరో అయి స్టార్ డమ్ తెచ్చుకున్న తర్వాత కొంతమంది విజయ్ అభిమానులు నానిపై పలు విమర్శలు చేసారు. విజయ్ కి కూడా నానితో విబేధాలు వచ్చాయంటూ.. నాని అభిమానులు విమర్శలు చేసారు. ఇలా కొన్ని నెలలు ఈ ఇద్దరి ఫ్యాన్స్ నెట్టింట పోస్టులు పెడుతూ రక రకాల కామెంట్స్ చేసారు. విజయ్, నాని మధ్య ఎలాంటి గొడవలు లేవని ఒక్క హాగ్ తో క్లారిటీ ఇచ్చారు.
దుబాయ్ లో సైమా అవార్డుల ఈవెంట్ గ్రాండుగా జరిగింది. ఈ వేడుకల్లో హీరో నాని దసరా సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. అయితే ఈ అవార్డుని విజయ్ దేవరకొండ ఇచ్చారు. నాని స్టేజిపై రాగానే ముందుగా విజయ్ ని హాగ్ చేసుకున్నాడు. అవార్డు ఇచ్చేముందు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. " నా ఫస్ట్ మూవీ హీరో. నాగ్ అశ్విన్ పిలిచి ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో నాకు అవకాశం ఇచ్చారు.. ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతాడో అనుకున్నా. కానీ ఆ రోజు నాని నాకు చాలా సపోర్ట్ చేసాడు. ఇండస్ట్రీలో అందర్ని అన్న అని పిలుస్తూ ఉంటారు. ఇప్పటి నుంచి నేను కూడా నానిని అన్న" అని పిలుస్తానని అన్నాడు.
Read More..