విజయ్ ఆంటోనీ ‘విక్రమ్ రాథోడ్’ ఫస్ట్ లుక్..!

by Disha Web Desk 10 |
విజయ్ ఆంటోనీ ‘విక్రమ్ రాథోడ్’ ఫస్ట్ లుక్..!
X

దిశ, సినిమా: వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ హీరో విజయ్ ఆంటోనీ. రీసెంట్‌గా ‘బిచ్చగాడు 2’తో సూపర్ హిట్ అందుకున్న ఆంటోని ఇప్పుడు అదే జోష్‌లో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘విక్రమ్ రాథోడ్’తో రాబోతున్నాడు. యోగేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండగా సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోనూ సూద్, సంగీత, ఛాయా సింగ్, యోగి బాబు, రాధా రవి, కస్తూరి శంకర్, రోబో శంకర్, మనీష్ కాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. ఇందులో ఆంటోని ముఖంపై గాయాలతో కనిపించగా.. విలన్ అతని పాయింట్ బ్లాక్‌లో గన్‌తో గురిపెట్టినట్లుగా ఉంది.

Also Read: ‘ఆదిపురుష్’ రూ.500 కోట్లు డెస్ట్‌‌బిన్ లోకే.. మతపరమైన సినిమాను నాశనం చేసినందుకు మేకర్స్‌కు సిగ్గుండాలి..

Next Story