ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ తేదీ ఖరారు

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-15 08:33:31  IST  )

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) వరుస సినిమాల్లో నటించినప్పటికీ హిట్ పడటం లేదు.

ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ పొలిటికల్ థ్రిల్లర్ .. స్ట్రీమింగ్ తేదీ ఖరారు
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) వరుస సినిమాల్లో నటించినప్పటికీ హిట్ పడటం లేదు. విభిన్న పాత్రలో నటిస్తున్నప్పటికీ లాభం లేకుండా పోతుంది. ఇక ఇటీవల విజయ్ ఆంటోని నటించిన చిత్రం ‘భద్రకాళి’(Bhadrakali). అరుణ్ ప్రభు దర్శకత్వంలొ వచ్చిన ఈ థ్రిల్లర్ పొలిటికల్ చిత్రంలో రియా జితు(Riya Jitu), తృప్తి రవీంద్ర (Trupthi Ravindra)హీరోయిన్లుగా నటించగా.. వాగై చంద్రశేఖర్(Chandrasekhar), సునీల్ కృపలానీ, కిరణ్, సెల్ మురుగన్, కీలక పాత్రలో కనిపించనున్నారు.

విజయ్ ఆంటోని కార్పోరేషన్ రామాంజనేయులు జవ్వాజీ ప్రొడక్షన్, స్రవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై విజయ్ ఆంటోని, మీరా నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 19న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.కథ విషయానికొస్తే.. ఖమ్మం జిల్లాలో అనాథగా పెరిగిన హీరో తెలుగు రాజకీయాల్లో పైరవీలు, లాబీయింగ్ చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తుంటాడు. అసాధ్యమైన పనులు కూడా సాధ్యం చేస్తూ రాజకీయాల్లో రాణిస్తుంటాడు.

ఈక్రమంలోనే రాజకీయ వ్యూహకర్త అతడిపై కేసు పెట్టి జైల్లో వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఈ సినిమా స్టోరీ. అయితే ఈ చిత్రం నెల రోజులకే ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ‘భద్రకాళి’ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జియోహాట్‌స్టార్ సొంతం చేసుకోగా.. తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెళ్లడించగా.. సినీ ప్రియులు ఆనందపడుతున్నారు.

READ MORE ....

అసురుడు వచ్చేశాడు.. యుద్ధం తెచ్చేసాడు.. అంచనాలను పెంచుతున్న ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్

Next Story