ప్రమాదంపై విజయ్ ఆంటోని ట్వీట్.. ఆసక్తిగా చూస్తున్న అభిమానులు

by Disha Web |
ప్రమాదంపై విజయ్ ఆంటోని ట్వీట్.. ఆసక్తిగా చూస్తున్న అభిమానులు
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల క్రితం బిచ్చగాడు సినిమా హీరో విజయ్ ఆంటోనికి మలేషియాలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బోట్‌లో ఓ యాక్షన్ సీన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో విజయ్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని, ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తాజాగా, విజయ్ ఆంటోని తన ఆరోగ్య పరిస్థితిపై ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ''ప్రియమైన మిత్రులారా మలేసియాలో 'పిచైకారన్-2' (బిచ్చగాడు-2) షూటింగ్‌లో దవడ, ముక్కుకు గాయాలుకాగా, వాటికి సంబంధించి సర్జరీ పూర్తైంది. ఈ సర్జరీ నుంచి సురక్షితంగా కోలుకున్నా. ఇప్పుడే ఒక పెద్ద సర్జరీ పూర్తైంది. వీలైనంత త్వరగా మీతో మాట్లాడతాను. నా ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించినందుకు, సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు' అంటూ ఫొటోను షేర్ చేశాడు విజయ్ ఆంటోని.


Next Story