ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకంపై స్పందించిన విజయ్ ఆంటోనీ.. నిజాలు బయటపడతాయంటూ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

హీరో శ్రీరామ్(Shri Ram) డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తమిళ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది.

ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకంపై స్పందించిన విజయ్ ఆంటోనీ.. నిజాలు బయటపడతాయంటూ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: హీరో శ్రీరామ్(Shri Ram) డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన తమిళ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తోంది. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయగా.. కొకైన్ వాడినట్లు నిర్ధారణ అయింది. ఏకంగా 40 సార్లు గ్రాముకు రూ.12000 చొప్పున కొకైన్ కొనుగోలు చేసి మొత్తం రూ.4. 72 లక్షలు చెల్లించినట్ల ఆధారాలు బయటపడ్డాయి. ఆయనతో పాటు తమిళ ఇండస్ట్రీకి చెందిన నటుడు కృష్ణ కూడా ఉన్నట్లు పోలీసులకు చెప్పడంతో ఆయన కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, విజయ్ ఆంటోని(Vijay Antony) ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకంపై స్పందించారు. ‘‘ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం బాగా పెరిగిపోయింది. గతంలోనూ డ్రగ్స్ వాడారు ఇదే మొదటిసారి కాదు. శ్రీరామ్ కేసులో నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయి.

అప్పుడు అసలు విషయాలు అందరికీ తెలుస్తాయి. నేను ఎప్పుడూ వాటికి వ్యతిరేకమే. అందుకే వాటిని ఎంకరేజ్ చేయన. అయితే రాజకీయాల్లోకి వస్తానంటే కొంతమంది నాపై ప్రచారం చేస్తున్నారు. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదు. నాకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. కేవలం ఫేమ్ ఉంది కదా అని రాజకీయాల్లోకి రాలేను. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లడం కామన్ అయినప్పటికీ ప్రజల మద్ధతు ఉంటేనే అధికారం దక్కుతుంది. నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధాలు లేవు కాబట్టి రాను’’ అని చెప్పుకొచ్చారు. కాగా, నటుడు విజయ్ ఆంటోనీ 'మార్గన్' చిత్రం జూన్ 27న థియేటర్స్‌లోకి రానుంది. ఈ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బ్రిగిట్టా, సముద్రఖని కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ ఆంటోనీ ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా, నిర్మిస్తున్నారు సంగీతం కూడా సమకూర్చారు. ఈ సినిమా ప్రమోషన్ పనులు ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయి.

Next Story