దుబాయ్‌లో అడ్డంగా బుక్కైన రష్మిక.. మళ్లీ అతడితోనే

by Disha Web Desk 7 |
దుబాయ్‌లో అడ్డంగా బుక్కైన రష్మిక.. మళ్లీ అతడితోనే
X

దిశ, సినిమా: స్టార్ నటులు విజయ్ దేవరకొండ, రష్మికల రిలేషన్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ ఓ వైపు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ క్రమంలోనే తమకేం పట్టనట్లు ఇటీవల మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ కెమెరాల కంట చిక్కిన ఈ జోడి.. మరోసారి దుబాయ్ వేదికగా ఫ్యామిలీతోకలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ దొరికిపోయారు.

ఈ మేరకు ఓ నెటిజన్ పోస్ట్ చేసిన ట్విట్‌లో విజయ్ తన పేరెంట్స్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలతోపాటు ఓ రెస్టారెంట్ దగ్గర విజయ్ ముందు నిలబడి స్మైల్ ఇస్తున్న రష్మిక కూడా కనిపించింది. దీంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అవగా.. 'వీరిద్దరూ లవ్ బర్డ్సే అని కన్ఫర్మ్స్ అయింది' అంటూ అభిమానులు చర్చిస్తున్నారు.

Next Story

Most Viewed