నయన్-విఘ్నేశ్‌ల ఫస్ట్ యానివర్సరీ.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్

by Disha Web Desk 10 |
నయన్-విఘ్నేశ్‌ల ఫస్ట్ యానివర్సరీ.. డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: స్టార్ నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌లు మొదటి పెళ్లిరోజు సెలబ్రెట్ చేసుకుంటున్నారు. గతేడాది జూన్‌లో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జోడికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా తమ మొదటి వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని విఘ్నేశ్ ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు. ‘నీవు నా లైఫ్‌లోకి వచ్చి యేడాది గడిచింది. ఫస్ట్ ఇయర్‌లోనే ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. ఊహించని ఓటములు, కఠిన పరీక్షలు ఎదురయ్యాయి. అయినా మనలో ఉన్న బాధను పిల్లలను చూడగానే మరిచిపోతాం. వాళ్లను చూస్తే మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిజంగా కుటుంబం ఇచ్చే బలం మరేది ఇవ్వలేదు. మనమిద్దరం కలిసి సాధించాల్సినవి చాలా ఉన్నాయి. మన అందమైన లైఫ్‌లోకి మరో సంవత్సరానికి సంతోషంగా వెల్‌కమ్ చెబుదాం’ అంటూ భార్యకు విసెష్ తెలిపాడు. ఇక సెలబ్రిటీలు, అభిమానులు కూడా ఈ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read More... తమన్నా రాత్రి, పగలు తేడా లేకుండా అతడితో ఎంజాయ్‌.. ఆ ఫొటో వైరల్

‘సైతాన్’ వల్గర్ చిత్రం కాదు.. ఇష్టముంటేనే చూడండి: దర్శకుడు

Next Story