నిద్రమత్తులో బోల్డ్ క్యారెక్టర్స్ ఒప్పుకున్న నటి.. ఆ తర్వాతే కెరీర్ మారిపోయిందట

by Dishaweb |
నిద్రమత్తులో బోల్డ్ క్యారెక్టర్స్ ఒప్పుకున్న నటి.. ఆ తర్వాతే కెరీర్ మారిపోయిందట
X

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ నటి విద్యాబాలన్ తన కెరీర్ ఒడిదొడుకులపై ఓపెన్ అయింది. 1995లో వచ్చిన ‘హమ్ పాంచ్’ టీవీ సిరీస్‌తో కెరీర్ మొదలుపెట్టిన నటి.. మొదట్లో నటించిన అన్నీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచాయని చెప్పింది. అయితే కొంతకాలం తర్వాత వరుస ఫ్లాఫ్‌లతో అనేక స్ట్రగుల్స్ ఎదుర్కొన్నానని, ఏంత కష్టపడి పనిచేసినా ఏ ప్రాజెక్ట్ సంతృప్తిని ఇవ్వలేకపోయిందని వాపోయింది. ఈ క్రమంలో అవకాశాలులేక సతమతమవుతున్నపుడే ‘ఇష్కియా’ చాన్స్ రావడంతో ఊపిరి పీల్చుకున్నానని పేర్కొంది. ‘2010లో వచ్చిన ‘ఇష్కియా’ మూవీ విజయం వరకూ నా కెరీర్ నిద్రావస్తలోనే ముందుకెళ్తున్నట్లు భావించాను. ఆ తర్వాత రొమాంటిక్ స్టోరీలపై ఆసక్తితో బోల్డ్ క్యారెక్టర్లు పోషించడంతో ఊహించని స్థాయిలో కెరీర్ మలుపు తిరిగింది’ అంటూ పలు విషయాలు ప్రస్తావించింది.

Read More: మళ్లీ ఆ సంస్థకు ప్రచారకర్తగా జూనియర్ ఎన్టీఆర్



Next Story