నైట్ క్లబ్‌లో రెచ్చిపోయిన షాహిద్‌-కరీనా కపూర్.. ముద్దు వీడియో లీక్

by Dishanational2 |
నైట్ క్లబ్‌లో రెచ్చిపోయిన షాహిద్‌-కరీనా కపూర్.. ముద్దు వీడియో లీక్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటులు షాహిద్ కపూర్, కరీనా కపూర్‌లకు సంబంధించిన ఓ సీక్రెట్ కిస్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు 2004లో ముంబై నైట్‌క్లబ్‌లో షాహిద్ కపూర్ అప్పటి ప్రియురాలైన కరీనా కపూర్‌ను ముద్దుపెట్టుకున్న వీడియో కేవలం ఐదు వందల రూపాలకే లీక్ అయిందని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మయాంక్ శేఖర్ అనే రిపోర్టర్ వెల్లడించాడు. ‘ముగ్గురు పిల్లలు వీడియోతో మా కార్యాలయానికి వచ్చారు. మాకు ఆ ముద్దు సీన్ చూపించారు. దీంతో కొంత డిస్కషన్ తర్వాత ఆ వీడియోను మాకు ఇచ్చేందుకు కేవలం రూ.500 తీసుకున్నారు’ అంటూ వివరంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ మరోసారి చర్చనీయాంశమైంది.

Also Read: మా ఫ్యామిలీ మానసిక రుగ్మతలతో పోరాడుతుంది: స్టార్ హీరో కూతురు..

Next Story

Most Viewed