‘సైంధవ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అట్రాక్ట్ చేస్తున్న అనౌన్స్‌మెంట్ పోస్టర్‌

by Disha Web Desk 13 |
‘సైంధవ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అట్రాక్ట్ చేస్తున్న అనౌన్స్‌మెంట్ పోస్టర్‌
X

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్ 75వ చిత్రం ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న సినిమా లెంతీ షెడ్యుల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షూట్‌లో వెంకటేష్, ఇతర తారాగణం పాల్గొంటున్నారు. మూవీ నిర్మాణ దశలో ఉన్నప్పటికీ విడుదల తేదీ అనౌన్స్ చేసిన మేకర్స్.. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో వెంకీ చేతిలో మెషిన్ గన్ పట్టుకుని కంటైనర్ పైన సీరియస్‌గా కూర్చోవడం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్, గ్లింప్స్‌లో హీరో ఇంటెన్స్ అవతార్‌లో కనిపించగా ఈ కొత్త పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ మూవీతో నవాజుద్దీన్ సిద్ధిఖీ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండగా.. ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Also Read...

ఐయామ్ ఏ రియల్ డఫర్.. నాకు తెలివి లేదని ఒప్పుకుంటా : అదితి రావు హైదరీ



Next Story

Most Viewed