ఆ సినిమాలో భాగమైనందుకు చాలా గౌరవంగా ఉంది.. శృతి హాసన్ ట్వీట్ వైరల్

by Disha Web Desk 6 |
ఆ సినిమాలో భాగమైనందుకు చాలా గౌరవంగా ఉంది.. శృతి హాసన్ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ శృతి హాసన్ ‘సలార్’ మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూ ఉంటుంది. అయితే ఈ అమ్మడు ఇటీవల ‘ది ఐ’ మూవీతో హాలీవుడ్‌లోనూ పరిచయం అయిన విషయం తెలిసిందే. లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ది లాస్ట్ కింగ్‌డమ్ చిత్రం ఫేమ్ మార్క్ రౌళి ఇందులో హీరోగా నటించాడు. అతని సరసన హీరోయిన్‌గా శృతి హాసన్ నటించింది.

తాజాగా, శృతి హాసన్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ‘‘గ్రీక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా, లండన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా ఎంపికైన ఈ అందమైన కథ THE EYEలో భాగమైనందుకు చాలా గౌరవంగా ఉంది! కథాంశంతో పాటు పర్యావరణం పట్ల కూడా ప్రేమ, శ్రద్ధతో ఈ చిత్రాన్ని రూపొందించాం. గ్రీన్ షూట్స్ సస్టైనబిలిటీ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించి పర్యావరణ, కార్బన్ ప్రభావాన్ని తగ్గించడానికి సిబ్బంది సమిష్టిగా పనిచేశారు’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Next Story

Most Viewed