Venuswamy: వివాదంలో వేణుస్వామి.. మీడియా చానళ్లపై ఫైర్ అవుతూ సెన్సేషనల్ వీడియో విడుదల చేసిన ఆయన భార్య

by Hamsa |   ( Updated:2024-08-13 13:39:05.0  )
Venuswamy: వివాదంలో వేణుస్వామి.. మీడియా చానళ్లపై ఫైర్ అవుతూ సెన్సేషనల్ వీడియో విడుదల చేసిన ఆయన భార్య
X

దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిత్యం సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు జాతకాలు చెబుతూ ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ఇటీవల ఆయన చెప్పిన విషయాలు కొన్ని నిజం కాకపోవడంతో.. స్వయంగా ఆయనే నేను జాతకాలు చెప్పను అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ముఖ్యంగా సెలబ్రిటీల గురించి చెప్పను అని అన్నాడు. ఇక అప్పటి నుంచి ఎవరి జాతకాలు చెప్పని వేణు స్వామి. ఇటీవల అక్కినేని నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం జరిగిన తర్వాత ఓ పోస్ట్ పెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాకుండా వారి జాతకాలు విశ్లేషణ చేశానంటూ ఓ వీడియోను విడుదల చేశాడు. వీరిద్దరి జాతకాలు బాలేవు. అసలు నాగార్జున నిషేద ముహూర్తంలో నిశ్చితార్థం చేశారు. వీరిద్దరు ఓ అమ్మాయి వల్ల విడిపోతారు ఎక్కువ కాలం కలిసి ఉండరు. అది కూడా 2027 వరకు మాత్రమే దంపతులుగా ఉంటారు.

ఆ తర్వాత విడాకులు తీసుకుంటారు అని చెప్పుకొచ్చాడు. ఇక వేణు స్వామి వీడియో గత కొద్ది రోజుల నుంచి వైరల్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఆయనను ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో వేణు స్వామి మరో వీడియోను విడుదల చేశాడు. మా అధ్యక్షుడు మంచు విష్ణు తనకు కాల్ చేశారని.. ఇకపై వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన జ్యోతిష్యం చెప్పనని అన్నాడు. ఈ క్రమంలోనే.. వేణు స్వామిపై మహిళా కమిషన్ ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఆయనకు నోటీసులు కూడా పంపింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ వేణు స్వామి వివాదంపై ఆయన భార్య సింగర్ వీణా శ్రీవాణి ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ ఇప్పుడు నేను సీనియర్ జర్నలిస్ట్ వీణా శ్రీవాణిగా వీడియో చేస్తున్నాను. అయితే ఓ వ్యక్తి నాకు ఓ పోస్ట్ పంపించాడు. అందులో ఓ జ్యోతిష్యుడు జాతకం చెప్పాడని ఉంది. అయితే ఒక జ్యోతిష్యం చెప్పిన మనిషి మీద గంటలు గంటలు టైమ్ స్పెండ్ చేసి వార్తలు రాస్తున్నారు. మీడియా అనేది చాలా పవర్ ఫుల్. దానికి విలువ లేకుండా పోయింది. ఎవడెవడో ఏదో చేశాడని అంటున్నారు. రాజ్ తరుణ్, లావణ్య స్టోరీ గురించి చానల్స్‌కు ఉన్న రూల్స్ కూడా పాటించకుండా ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. వాళ్లని ఎన్నో మాటలు అన్నప్పుడు మీ మీద కేసులు పెట్టేవాళ్లు లేరా.

ఒక శాటిలైట్ చానల్ విద్యార్థులకు పనికొచ్చే విషయాల గురించి ప్రచారం చేయకుండా ఏవేవో ఇస్తున్నారు. ఈ సెలబ్రిటీలకి ప్రైవసీ లేకుండా చేస్తుంది ఎవరు మీరు కాదా. సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా జర్నలిస్టులు అస్సలు వదలరు. మొన్న నిహారిక ఓ విషయం గురించి చెప్తుంటే నాకే బాధ అనిపించింది. కెమెరామెన్స్ కొందరు ఆమె ఇంటి చుట్టూ ఉండి గోడలు దూకేసి ఫొటోలు తీస్తున్నారట. అయితే ఇటీవల మంచు విష్ణు కాల్ చేసి బాగా మాట్లాడాడు. అయితే నేను ఆయనకు ఒకటి చెప్పాలనుకుంటున్నా.. మీ దగ్గరకు వచ్చిన జర్నలిస్టులను ఒక విషయం అడగండి. ఒక సినిమా చేయాలంటే వందల మంది పని చేస్తారు. కానీ వీరంతా ఒక్క రివ్యూతో మూవీ మొత్తం డిజాస్టర్ అయ్యేలా వాళ్లు రోడ్ల మీద పడేలా చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్లని ఏం చేయాలి. తప్పు చేస్తే ఎవరైనా కేసు పెట్టొచ్చు. మీరు చేసేదే ఇలాంటి పనులు. ఒక్కో చానల్ ఒక్కో పార్టీకి సపోర్ట్ చేస్తారు. అలాంటి ఓ జ్యోతిష్యుడు మాత్రం జాతకాలు చెప్తే ఇలా చేస్తున్నారు. ముఖ్యంగా యూత్ మారండి అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story