- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో పెద్ద బాంబు పేల్చిన వేణు స్వామి.. ఆ స్టార్ హీరో కొడుకు ఎదగకపోవడానికి ఆమె కారణమట..?
సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి బాగా ఫేమస్ అయ్యారు.

దిశ,వెబ్ డెస్క్: సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి బాగా ఫేమస్ అయ్యారు. సమంత, నాగచైతన్యలు మధ్యలోనే విడిపోతారని ముందే చెప్పి సంచలనం సృష్టించారాయన. ఆయన చెప్పినట్టే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు . ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు.
తాజాగా అక్కినేని అఖిల్ కెరీర్ గురించి చెబుతూ వేణు స్వామి పెద్ద బాంబు పేల్చారు. అఖిల్‌కు స్టార్‌డమ్ రాకపోవడానికి జాతక లోపమే కారణమని తేల్చి చెప్పేసారు. అఖిల్ జాతకం ఇప్పుడు అస్సలు బాగోలేదని ..ఈ విషయంలో నాగార్జున కలగజేసుకుని అఖిల్ జీవితాన్ని చక్కదిద్దితే బావుంటుందని ఆయన కోరారు. తల్లి అమల మాటలు వినడం ఎప్పుడు మానేస్తాడో అప్పుడే అఖిల్ జీవితం బాగుంటుందని , నాగార్జున చెప్పిన విషయాలను అఖిల్ వింటే కెరీర్ బాగుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. వేణు స్వామి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.






