- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Venu swamy: కేసులు, అరెస్టులపై స్పందించిన వేణు స్వామి.. సంచలనం సృష్టిస్తున్న వీడియో
దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన సెలబ్రిటీల జాతకాలను చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు. నటీనటుల పెళ్లి విషయంలో వారి జాతకాలను చూసి వీరికి పెళ్లి అచ్చు రాదు.. విడాకులు తీసుకుంటారు అని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా చెప్పిన వాటిల్లో ముఖ్యంగా సమంత- నాగచైతన్య విడాకులు తీసుకుంటారు అని బిగ్‌బాంబ్ పేల్చిన సంగతి తెలిసిందే. అలా ఈయన చెప్పిన తర్వాత వీరు నిజంగానే విడాకులు తీసుకున్నారు. దీంతో వేణు స్వామి జాతకాలు నిజమవుతాయని సెలబ్రిటీలు సైతం అతని వద్దకు వచ్చి జాతకాలను చెప్పించుకుంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా నాగ చైతన్య శోభిత ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నెక్స్ట్ డేనే వీరి వైవాహిక జీవితం పై సంచలన కామెంట్స్ చేశాడు. అందులో భాగంగా సమంత-నాగచైతన్య మాదిరిగానే నాగచైతన్య-శోభితల జాతకం కలవలేదని, వీరిద్దరు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేరంటూ చెప్పి అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ మొదలైంది. కాగా తెలుగు ఫిలిం జర్నలిస్టులు ఆయన జ్యోతిష్యంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ అతడికి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా అరెస్ట్ కూడా చేయవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా అతని అరెస్ట్ పై వస్తున్న వార్తలపై వేణు స్వామి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘కేసులపై ఇప్పుడు నేనేమీ మాట్లాడను. టైం తీసుకొని చాలా విషయాలు మాట్లాడాలి. మాట్లాడుదాం.. తప్పకుండా అన్ని విషయాలు మాట్లాడాలి. కేసులు గట్రా అంటే హీరోయిన్లను, మా అసోసియేషన్ మెంబర్ అయిన ఓ నటిని కూడా ఈ మధ్య కాలంలో ఒక రాజకీయ నేత బండ బూతులు తిట్టాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను ఎలా ఆడుకున్నారో అన్నీ చూశాం. నేను జాతకాలు చెబితేనే అరెస్టులు అంటే.. సరే ఎవరు కేసులు పెట్టారో నాకు అయితే తెలియదు. ఎవరో ఫోన్ చేసి గురువు గారు మీరు అరెస్ట్ అయ్యారంట అని అడిగితే లేదు నాయనా నేను నా ఆఫీసులోనే ఉన్నాను. ఇక్కడ పూజలు జరుగుతున్నాయని చెప్పాను’ అని చెప్పుకొచ్చారు వేణు స్వామి. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
(video link credits to paramkusham venuswamy instagram id)