- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్ హీరోయిన్ ఇంట్లో వేణుస్వామి ప్రత్యేక పూజలు.. కారణం అదేనా?
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల జీవితంలో ఏం జరుగుతుందో ముందుగానే చెప్తుంటారు..

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల జీవితంలో ఏం జరుగుతుందో ముందుగానే చెప్తుంటారు. గతంలో నాగచైతన్య, సమంత కొద్ది రోజులకే విడిపోతారని చెప్పారు. సామ్, చై ఆయన చెప్పినట్లుగానే కొద్ది రోజుల తర్వాత విడాకులు తీసుకోవడంతో వేణుస్వామికి ఫుల్ పాపులారిటి వచ్చింది. తాజాగా, టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి రాజ శ్యామల పూజ నిర్వహించినట్లు సమాచారం. వేణుస్వామి, నిధి అగర్వాల్‌తో ప్రత్యేక పూజలు చేయిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ పూజలు సినిమా అవకాశాల కోసమే నిధి ప్రత్యేక పూజలు చేసిందని టాక్. ఇదిలా ఉంటే అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ సినిమాతో నిథి అగర్వాల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో కీలక పాత్రలో నిధి నటిస్తుంది.






