వేణు స్వామి సంస్కారానికే వదిలేస్తున్నా.. ఆయన పూజ వల్ల ఒరిగిందేమి లేదంటూ ప్రగతి షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి(pragathi) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అవకాశాలు కాస్త తగ్గిపోవడంతో పర్సనల్ లైఫ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది.

వేణు స్వామి సంస్కారానికే వదిలేస్తున్నా.. ఆయన పూజ వల్ల ఒరిగిందేమి లేదంటూ ప్రగతి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి(pragathi) గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. అవకాశాలు కాస్త తగ్గిపోవడంతో పర్సనల్ లైఫ్‌పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇటీవల ఆమె రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. పవర్ లిఫ్టింగ్‌లో ఏకంగా నాలుగు పతకాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. టర్కీ వేదికగా జరిగిన షియన్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో పాల్గొని ఒక బంగారు పతకంతో పాటు మూడు సిల్వర్ మెడల్స్ దక్కించుకుంది. దీంతో పలువురు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ఈక్రమంలోనే.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి(Venu Swamy) ప్రగతికి మెడల్స్ రావడానికి కారణం ఆయన పూజలే అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో అది చూసిన వారంతా ఆయన పూజలకు ఇంత పవర్ ఉందా? అని షాక్ అవుతూ.. ప్రగతిని ప్రశ్నలతో ముంచెత్తారు.

తాజాగా, ఈ విషయంపై ఆమె స్పందించి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ‘‘గత కొద్ది రోజులుగా కొన్ని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేణు స్వామి పూజల వల్లే నాకు ఈ విజయం సాధ్యమైంది అని అంతా అనుకుంటున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సుమారు రెండున్నరేళ్ల ముందు నేను చాలా లోగా ఉండేదాన్ని. అప్పుడు నా ఫ్రెండ్స్ రెఫర్ చేయడంతో నేను వేణుస్వామి వద్దకు వెళ్లాను. నాకే కాదు మన పరిస్థితులు బాగో లేనప్పుడు అలాంటి పూజలు చేయించకోవాలన్న ఆలోచన చాలా మందికి వస్తుంది. అలా నాకూడా వచ్చింది.. ఈ విషయం ఆయనకు చెప్పడంతో స్వామి ఏదో పూజ చేశారు.

కానీ నాకు పెద్దగా ఫలితమేమీ కనిపించలేదు. ఈ పూజల వల్ల మంచి ఫలితాలు వచ్చాయని మాత్రం నాకేమీ అనిపించడం లేదు. కానీ ఏడాది క్రితం జరిగిన పూజల ఫొటోలను మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ వైరల్ చేస్తున్నారు. వాటి గురించి నేను ఏం మాట్లాడగలను? ప్రగతి మెడల్స్‌ సాధించడానికి నేనే కారణమని అంటూ వేణుస్వామి చేస్తున్న కామెంట్లను ఆయన సంస్కారానికే వదిలేస్తున్నా. మన టైమ్‌ బాగోలేకపోతే ఇటువంటి జ్యోతిష్యాలనే కాకుండా అన్నింటినీ నమ్ముతాం’’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా వేణు స్వామిపై మండిపడుతున్నారు.

Next Story