మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంపై గృహహింస కేసు : పోలీసులకు కోడలి ఫిర్యాదు

by Naga Rani Yarlagadda |

వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు నమోదయింది.

మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంపై గృహహింస కేసు : పోలీసులకు కోడలి ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు నమోదయింది. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ భార్య మేఘన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయింది. తనపై భర్త రాజీవ్, అత్త మామలు వరకట్న వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మేఘన ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు గృహహింస కేసుతో పాటు.. జోగి రమేష్ కుటుంబంపై హత్యాయత్నం, చీటింగ్ కేసులు కూడా నమోదు చేశారు. భర్త, అత్తమామలు సహా మొత్తం 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఇబ్రహీంపట్నం పోలీసులు వెల్లడించారు.

గతేడాది మే నెలలో రాజీవ్ - మేఘనల వివాహం ఘనంగా జరిగింది. పెళ్లయిన కొంతకాలానికి ఇద్దరి మధ్య, కుటుంబంతో మనస్పర్థలతో పాటు.. వరకట్న వేధింపులు మొదలైనట్లు మేఘన ఆరోపిస్తోంది. పెద్దలు పలుమార్లు రాజీ చేసే ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. త్వరలోనే జోగి రమేష్ కుటుంబ సభ్యులను ఈ కేసు విషయమై విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Next Story