వేణు ఎల్దండి సెకండ్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

by Disha Web Desk 4 |
వేణు ఎల్దండి సెకండ్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
X

దిశ, వెబ్‌డెస్క్: బలగం మూవీ సక్సెస్‌ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఆ మూవీ టీం ఎంజాయ్ చేస్తున్నారు. బలగం సినిమాతో డైరెక్టర్ అవతారమెత్తి మెప్పించారు వేణు ఎల్దండి. కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన తొలి ప్రయత్నంలోనే తెలంగాణ నేటివిటికి కనెక్ట్ అయ్యే కథతో మెప్పించారు. కొత్త కాన్సెప్ట్‌ను అందరూ ఆదరించడం, విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు రావడంతో దిల్ రాజు కీలక ప్రకటన చేశారు.

డైరెక్టర్ వేణు ఎల్దండి తమ బ్యానర్‌లోనే రెండో సినిమాను కూడా చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు నెలల క్రితం తను చెప్పిన ఐడియాస్‌లో ఒకటి బాగా నచ్చింది. దాని మీద వర్క్ చేయమని చెప్పానని దిల్ రాజు అన్నారు. దీంతో ఈ కాంబో నుంచి మరో సినిమా రావడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అయితే వేణు ఎల్దండి దర్శకుడిగా పరిచయమైన బలగం సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన విషయం తెలిసిందే.

Next Story