- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘లక్కీ భాస్కర్’ సీక్వెల్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చిన వెంకీ అట్లూరి.. ఫుల్ ఖుషీలో అభిమానులు
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan,), వెంకీ అట్లూరి(Venky Atluri) కాంబోలో వచ్చిన మూవీ ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar).

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan,), వెంకీ అట్లూరి(Venky Atluri) కాంబోలో వచ్చిన మూవీ ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar). మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంలో వచ్చి బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే బాగుంటుందని సినీ ప్రియులంతా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకీ అట్లూరీ సీక్వెల్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చారు.
‘‘అనుకున్నట్లుగానే లక్కీ భాస్కర్ పెద్ద హిట్ అయింది. ఈ మూవీ చేసినప్పుడు సీక్వెల్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు దానికి సీక్వెల్ చేయాలనే డిమాండ్స్ ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి. కాబట్టి కచ్చితంగా ‘లక్కీ భాస్కర్’ సీక్వెల్ ఉంటుంది. కానీ దానికి కొంచెం టైమ్ పడుతుంది. అయితే ‘లక్కీ భాస్కర్’ చేసిన తర్వాత బయోపిక్స్ తెరకెక్కించాలని పలువురు అన్నారు. కానీ వాటిని తెరకెక్కించాలని లేదు. థ్రిల్లర్,పీరియాడిక్ చిత్రాలు చేయాలని కూడా లేదు. కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాలు చేస్తాను. అందుకు అనుగుణంగా ఇప్పుడు ఓ మూవీ చేస్తున్నాను ’’ అని చెప్పుకొచ్చారు.






