- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్ గెటప్ లో టాలీవుడ్ సీనియర్ హీరోలు ?
టాలీవుడ్ ఇండస్ట్రీలు అనేక రకాల సినిమాలు వస్తున్నాయి. క్రైమ్, థ్రిల్లర్, రొమాంటిక్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల సినిమా

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలు అనేక రకాల సినిమాలు వస్తున్నాయి. క్రైమ్, థ్రిల్లర్, రొమాంటిక్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల సినిమాలు వచ్చి ఈ సక్సెస్ అవుతున్నాయి. ఇక మల్టీస్టారర్ మూవీలు కూడా వచ్చి కొన్ని ఆడుతుంటే కొన్ని అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో... విక్టరీ వెంకటేష్ అతిధి పాత్ర చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి... అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా శర వేగంగా షూటింగ్ కూడా జరుపుకుంటుంది. అనిల్ రావిపూడి అంటేనే మినిమం గ్యారెంటీ ఉంటుంది. అంతేకాదు సినిమా మొత్తం కామెడీ యాంగిల్ లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాలో క్యామియో రోల్ చేయబోతున్నట్లు ఇటీవల వెంకటేష్ కూడా ప్రకటించారు. దీంతో వెంకటేష్ అటు చిరంజీవి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
అయితే ఈ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. విక్టరీ వెంకటేష్ అలాగే... మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో అండర్ కవర్ పోలీసులుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో వెంకటేష్ దాదాపు గంటసేపు కనిపిస్తారట. క్రైమ్ ఇన్వెస్టిగేషన్.. చుట్టూ ఈ కథ నడుస్తుందని కూడా టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి అటు వెంకటేష్ మధ్య కామెడీ ట్రాక్ బాగుంటుందట.






