- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎప్పటికీ గుర్తుండిపోయే కథ కోసం ఇద్దరు ఏకమయ్యారు.. ‘వెంకీ-77’ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ
విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అదే ఫామ్‌లో వరుస చిత్రాలు అనౌన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఈక్రమంలోనే వెంకటేష్, త్రివిక్రమ్(Trivikram Srinivas) కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొద్ది కాలంగా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన విడుదల కావడంతో సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇండిపెండెన్స్ డే కానుకగా వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన విడుదల అయింది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.
ఇక వేడుకకు వెంకటేష్ సోదరుడు సురేష్ బాబు(Suresh Babu) చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. ‘వెంకీ-77’వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుపుతూ నాగవంశీ ట్విట్టర్ ద్వారా ఫొటోలను షేర్ చేశారు. ‘‘యా కమాండర్ అండ్ చీఫ్ సెట్స్‌లోకి వచ్చారు. ఎప్పటికీ గుర్తుండిపోయే కథ కోసం వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏకమయ్యారు. త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఫుల్ ఖుషీ అవుతూ పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు.






