- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ క్రేజీ డైరెక్టర్‌తో వెంకటేశ్ సినిమా.. ఈసారి బొమ్మ బ్లాక్ బస్టరే అంటున్న ఫ్యాన్స్
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్(VICTORY VENKATESH) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్(VICTORY VENKATESH) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలను అందించి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. రీసెంట్‌గా అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) మూవీతో మనముందుకు వచ్చాడు. ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
అంతేకాకుండా రూ.300 కోట్లకు పైగా వసూళ్లును సాధించి వెంకీ కెరీర్‌లోనే అధిక వసూళ్లు కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచింది. అలాగే ఓటీటీ(OTT)లోనూ ఎన్నో రికార్డులు సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం వెంకీ తర్వాత సినిమా ఎవరితో చేస్తాడా అని సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సామజవరగమన రచయితల్లో ఒకరైన నందు రాసిన ఓ కథ వెంకటేశ్‌కు బాగా నచ్చిందట.
ఇది మంచి కామెడీ బేస్డ్‌గానే ఉంటుందని సమాచారం. అయితే నందుకు పెద్దగా అనుభవం లేదు కాబట్టి ఆయన నుంచి కేవలం కథ మాత్రమే తీసుకున్నాడట వెంకీ. ప్రస్తుతం డైరెక్టర్లను వెతికే పనిలో పడ్డాడట. ఇందులో భాగంగానే హరీష్ శంకర్(Harish Shanker)తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ న్యూస్ విన్న ఫ్యాన్స్ ఈ సారి బొమ్మ బ్లాక్ బస్టరే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
Megastar chiranjeevi: చిరంజీవి లగ్జరీ క్రూయిజ్ షిప్ వీడియో వైరల్.. అసలు విషయం ఏమిటంటే?






