Megastar chiranjeevi: చిరంజీవి లగ్జరీ క్రూయిజ్ షిప్ వీడియో వైరల్.. అసలు విషయం ఏమిటంటే?

by Yella Dhawani Reddy |

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి (Megastar chiranjeevi ) చెందిన లగ్జరీయస్ క్రూయిజ్ షిప్ (Luxurious cruise ship) అంటూ సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది.

Megastar chiranjeevi: చిరంజీవి లగ్జరీ క్రూయిజ్ షిప్ వీడియో వైరల్.. అసలు విషయం ఏమిటంటే?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి (Megastar chiranjeevi ) చెందిన లగ్జరీయస్ క్రూయిజ్ షిప్ (Luxurious cruise ship) అంటూ సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ షిప్‌ను చిరంజీవి 2023లో రూ.6075 కోట్లు ఖర్చు చేసి పెద్ద పెద్ద సునామీ, భూకంపాలకు సైతం ప్రభావితం కాకుండా చాలా ప్రత్యేకంగా తయారుచేయించారట. అంతేకాదు, ఈ విలాసవంతమైన షిప్‌‌ను బుల్లెట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్‌‌గా నిర్మించారట. అలాగే ఇందులో 350 కంటే ఎక్కవ బెడ్రూమ్‌లు 474 కంటే ఎక్కువ బాత్రూమ్‌లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, వాటర్ పార్కులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రూయిజ్ కేవలం లండన్, అమెరికా, పారిస్, అండమాన్‌లలో మాత్రమే పర్యటిస్తుందని, ఈ షిప్ ద్వారా చిరంజీవి ఏటా 125 కోట్ల ఆదాయం వస్తుందట.

అయితే, వైరల్ అవుతున్న ఈ వార్తలో ఎటువంటి నిజం లేదు. వీడియోలో ఉన్న విజువల్స్ కూడా వివిధ సందర్భాలకు సంబంధించినవిగా వెల్లడైంది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చిరంజీవి హైదరాబాద్‌లోని ఎక్స్‌పీరియం ఎకో పార్కు సందర్శించిన విజువల్స్, స్విట్జర్లాండ్‌కు చెందిన MSC క్రూయిసెస్, నార్వేజియన్ వివా అనే మరో క్రూయిజ్‌, దుబాయ్‌లోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌కు చెందిన విజువల్స్‌తో ఎడిట్ చేసినట్లు తేలింది.

ఇక ఇటీవల చిరంజీవికి యూకే (UK) పార్లమెంట్‌లోఅరుదైన ఘనత దక్కింది. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి ఆయన చేసిన‌ సేవ‌ల‌కుగానూ 'లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ ప్రదానం చేసింది. అలాగే, గ‌తేడాది ఏఎన్ఆర్ జాతీయ పుర‌స్కారం, ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డుల‌ను అందుకున్నారు.

Next Story