వెంకటేష్ సైంధవ్ విడుదల అప్పుడేనా...

by Sridhar Babu |

విక్టరీ వెంకటేష్ నటించిన 'సైంధవ్' చిత్రం షూటింగ్​ శరవేగంగా జరుగుతుంది.

వెంకటేష్ సైంధవ్ విడుదల అప్పుడేనా...
X

దిశ, వెబ్​డెస్క్​ : విక్టరీ వెంకటేష్ నటించిన 'సైంధవ్' చిత్రం షూటింగ్​ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం తాజాగా మరో కీలక షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకుంది. హీరో వెంకటేష్ తో పాటు శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ ఇతర తారాగణం ఈ సన్నివేశంలో పాల్గొన్నారు. నెక్స్ట్ ఫైనల్ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై యాక్షన్‌ ఎంటర్ ట్రైనర్ గా రూపొందుతుంది. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం కనిపిస్తోంది.

బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా, డాక్టర్ రేణు పాత్రలో రుహాని శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెర్మియా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన వారి ఫస్ట్ లుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్.మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీనిని పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో విడుదల చేయనున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్​ పూర్తయిన తరువాత పోస్టుప్రొడక్షన్​ కార్యక్రమాలు కంప్లీట్​ చేసుకొని ఈ ఏడాది డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని చిత్ర యునిట్ సన్నాహాలు చేస్తున్నారు. మరి వారు అనుకున్న సమయంలో విడుదల చేస్తారో మరి కొంత సమయం తీసుకుంటారో వేచి చూడాలి.

Next Story