Saindhav Movie : సైంధవ్ నుంచి వెంకటేష్ కూతురి ఫస్ట్ లుక్

by Disha Web Desk 7 |
Saindhav Movie  : సైంధవ్ నుంచి వెంకటేష్ కూతురి ఫస్ట్ లుక్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు ఉన్న విక్టరీ వెంకటేష్ ‘రానా నాయిడు’ సీరిస్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో తిరిగి తన ఇమేజ్‌ను దక్కించుకోవడం కోసం, వెంకటేష్ ఇసారి యాక్షన్ మూవీతో రాబోతున్నాడు. శైలేశ్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్’. ఈ మూవీ డిసెంబర్ 22న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో వెంకటేష్‌తో పాటు చిన్న పాప కూడా కనిపించింది. ఆ పాప ఈ మూవీలో వెంకటేష్ కూతురు. ఇక వెంకీ మామ ఈజ్ బ్యాక్ అనేలా కనిపిస్తున్న ఫస్ట్ లుక్స్‌ను ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు.

Read More: అవకాశాలు రాకపోవడం ఆ పని చేస్తున్న బన్నీ హీరోయిన్ పోస్ట్..

Next Story

Most Viewed