విక్ట‌రీ వెంక‌టేష్ కోసం అదిరిపోయే టైటిల్..60 ప్లస్ అంటూ !

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ... విక్టరీ వెంకటేష్ కు ఉన్న పాపులారిటీ అంతా కాదు. 64 సంవత్సరాలు

విక్ట‌రీ వెంక‌టేష్ కోసం అదిరిపోయే టైటిల్..60 ప్లస్ అంటూ !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ... విక్టరీ వెంకటేష్ కు ఉన్న పాపులారిటీ అంతా కాదు. 64 సంవత్సరాలు ఉన్నప్పటికీ... హీరోగా ఇండస్ట్రీని దున్నేస్తున్నాడు విక్టరీ వెంకటేష్. కామెడీ జోనర్ సినిమాలు ఎక్కువగా చేసే విక్టరీ వెంకటేష్.... ఈ మధ్యకాలంలో సంక్రాంతికి వస్తున్నాం అంటూ వచ్చి సక్సెస్ అందుకున్నాడు. మొన్న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయి... మంచి హిట్ అందుకుంది.

అయితే ఈ సినిమా రిలీజ్ అయి.. ఆరు నెలలు కావస్తున్నా.... మరో కొత్త ప్రాజెక్టుకు వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే.. త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు విక్టరీ వెంకటేష్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై చర్చలు కూడా ఫినిష్ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నెల నుంచి ప్రారంభం కానుందని అంటున్నారు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయట.

త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే వెంకటేష్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. అబ్బాయిగారు 60+ అనే టైటిల్.. ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Next Story