ఇదే నా బెస్ట్ ఫర్మార్మెన్స్.. ‘రానా నాయుడు’ కాంట్రవర్సీపై వెంకటేష్

by Disha Web Desk 7 |
ఇదే నా బెస్ట్ ఫర్మార్మెన్స్.. ‘రానా నాయుడు’ కాంట్రవర్సీపై వెంకటేష్
X

దిశ, సినిమా : ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ కంటెంట్‌పై వస్తున్న విమర్శలపై వెంకటేష్ ఎట్టకేలకు స్పందించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తానెప్పుడూ ఇలాంటి క్యారెక్టర్స్ చేయలేదని, వ్యక్తిగతంగా ఇది తనకు చాలా కొత్త అనుభూతినిచ్చిందన్నాడు. ‘నేనొక ఫ్యామిలీ హీరోగానే అందరికీ తెలుసు. కానీ, ఇప్పుడే కాస్త టర్న్ తీసుకున్నా. దర్శకనిర్మాతలు, మూవీ యూనిట్ నేను ఈ పాత్ర చేయలగలనని బలంగా నమ్మారు. ఈ విషయంలో చాలా సంతోషిస్తున్నా. ఏదేమైనా ఈ సిరీస్‌లో నా బెస్ట్ ఫర్మార్మెన్స్ ఇచ్చాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

అలాగే ఈ సమావేశంలో మాట్లాడిన రానా.. ‘బాబాయ్‌తో ఎప్పటికీ గుర్తుండిపోయే సిరీస్ చేసినందుకు ఆనందంగా ఉంది. అందరికీ గుర్తిండిపోయేలా చేయాలనే ఈ భిన్నమైన స్టోరీలో నటించాం. నిజానికి ఇదొక ఫ్యామిలీ డ్రామా మాత్రమే’ అంటూ తమ అభిప్రాయాలు వెల్లడించారు. సుప్రన్ వర్మ, కరణ్ అన్షుమన్ తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదిగా విడుదలవగా.. ఇందులోని శృంగార సన్నివేశాలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read: థైస్ షో తో పిచ్చెక్కిస్తున్న నేహా.. తట్టుకోలేక పోతున్నామంటున్న ఫ్యాన్స్!



Next Story

Most Viewed