'Veerasimha Reddy' ఫైట్స్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి: Duniya Vijay

by Chukka Sudharani |   (  Updated:2023-01-06 12:35:44  IST  )

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న చిత్రం 'వీర సింహారెడ్డి'.

Veerasimha Reddy ఫైట్స్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి: Duniya Vijay
X

దిశ, సినిమా: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న చిత్రం 'వీర సింహారెడ్డి'. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించిన సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. జనవరి 12న విడుదల కాబోతున్న చిత్రంలో మెయిన్ విలన్ పాత్ర పోషించిన కన్నడ నటుడు దునియా విజయ్ తాజా విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నాడు. 'బాలకృష్ణ, గోపిచంద్‌తో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం.

గోపీచంద్ ఈ పాత్ర గురించి చెప్పగానే థ్రిల్‌గా అనిపించింది. నా క్యారెక్టర్ సినిమాకు ఒక పిల్లర్‌లా ఉంటుంది. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర చేశాను. చిన్నప్పటి నుంచి బాలయ్య సినిమాలు చూస్తూ పెరిగాను. తొలిసారి ఆయనను సెట్‌లో చూడగానే నన్ను నేను నమ్మలేకపోయా. ఈ సినిమాలో ఫైట్స్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. బాలయ్యలాంటి ఎనర్జీ, డెడికేషన్ మాకూ కావాలి' అని చెప్పుకొచ్చాడు. అలాగే మంచి పాత్రలు వస్తే విలన్‌గా చేయడానికి సిద్ధమేనన్న విజయ్.. ప్రస్తుతం 'భీమా' అనే ఒక ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నట్లు తెలిపాడు.

Next Story