- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VD-14: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారంలో స్టార్ట్ కానున్న విజయ్-రష్మిక మూవీ షూటింగ్(పోస్ట్)
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తాజాగా నటించిన ‘కింగ్డమ్’(Kingdom) సినిమా థియేటర్లలో రిలీజ్ అయి మంచి టాక్‌తో దూసుకుపోతుంది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తాజాగా నటించిన ‘కింగ్డమ్’(Kingdom) సినిమా థియేటర్లలో రిలీజ్ అయి మంచి టాక్‌తో దూసుకుపోతుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది. అయితే ఆయన ప్రజెంట్ రాహుల్ సంకృత్యన్(Rahul Sankruthyan) డైరెక్షన్‌లో ‘వీడీ-14’(VD-14) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్‌కు జోడిగా రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే దీనిని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి శంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఒక వీరుడి పోరాటాన్ని చూపిస్తూ 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. అయితే ఈ వారంలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. మరి దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాకు అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నాడు.






