వరుణ్ పెళ్లి ఫంక్షన్లలో సందడి చేసిన మరో మెగా కొత్త కోడలు..ఆ హీరోయిన్ ఎవరితో లవ్ లో ఉందంటే?

by Disha Web Desk 6 |
వరుణ్ పెళ్లి ఫంక్షన్లలో సందడి చేసిన మరో మెగా కొత్త కోడలు..ఆ హీరోయిన్ ఎవరితో లవ్ లో ఉందంటే?
X

దిశ, సినిమా: లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి. ప్రీవెడ్డింగ్ షూట్ కూడా పూర్తి అయింది. ఇక అల్లు ఫ్యామిలీ ఇచ్చిన ప్రీవెడ్డింగ్ పార్టీలో వరుణ్, లావణ్యతో పాటు నాగబాబు, చిరంజీవి, సురేఖ, పద్మజ, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు అర్జున్, స్నేహ, అల్లు అరవింద్, ఉపాసన, వైష్ణవ్ తేజ్ తో పాటు నితిన్ ఆయన భార్యతో కలిసి వచ్చారు. ఇదిలా ఉంటే హీరోయిన్ రీతు వర్మ కూడా ఈ పార్టీలో కనిపించేసరికి అందరిలో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. రీతుకి మెగా ఫ్యామిలిలో అంత క్లోజ్ ఎవరు అనేది అర్థం కావడం లేదు.

నితిన్ వరుణ్ తేజ్ ఫ్రెండ్ కాబట్టి ఆయన ఆ పార్టీకి రావడంలో అర్థం ఉంది. కానీ రీతు వర్మ రావడం ఏంటీ? ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో ఏ హీరోతో ఎలాంటి సినిమాలో కూడా నటించడం లేదు. అలాంటిది ఈ ఫంక్షన్ లో రీతూ వర్మ ఎందుకు వచ్చిందనే డౌట్స్ మొదలయ్యాయి. దీంతో మెగా ఫ్యామిలీలోని ఒక హీరోతో రీతూ వర్మ ప్రేమలో పడిందని, అందుకే ఆ ఫంక్షన్ కి వచ్చిందని టాక్ వినపడుతుంది.



Next Story