- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిట్టు కోసం ప్రాణం పెట్టి.. చివరకు ఆసుపత్రి పాలైన వరుణ్ తేజ్.. ఆందోళనలో మెగా ఫ్యాన్స్
అయితే, ప్రాక్టీస్ సెషన్‌లో అనుకోకుండా ఆయన కాలికి గాయం అయ్యిందట.

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్ అభిమానులను కలవరపెట్టే వార్త ఒకటి బయటకు వచ్చింది. తన తదుపరి చిత్రం కోసం కష్టపడుతున్న సమయంలో ఆయనకు గాయం కావడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ వార్త ఇప్పుడు మెగా అభిమానుల్లో, ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వరుణ్ తేజ్ తన చెల్లి నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘బరి’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. వాలీబాల్ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామా కోసం వరుణ్ ఎంతో కష్టపడుతున్నారు. అయితే, ప్రాక్టీస్ సెషన్‌లో అనుకోకుండా ఆయన కాలికి గాయం అయ్యిందట. మొదట చిన్న దెబ్బే అనుకున్నప్పటికీ, వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఒక చిన్న సర్జరీ చేయించుకోబోతున్నట్లు తెలుస్తోంది. లెగ్ ఇంజ్యూరీ కావడంతో ఆయన నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు టాక్. కొన్ని రోజుల విశ్రాంతి తర్వాత ఆయన మళ్ళీ సెట్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. యధు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా గ్రాండ్‌గా లాంచ్ చేశారు.
వరుణ్ తేజ్ ఈ చిత్రం కోసం మేకోవర్ అవ్వడమే కాకుండా, ప్రొఫెషనల్ ప్లేయర్ లాగా కనిపించేందుకు కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. తన కెరీర్‌లో ఈ చిత్రం ఒక మేజర్ హిట్ అవ్వాలని ఆయన ఎంతో పట్టుదలతో ఉన్నారు. కేవలం ‘బరి’ మాత్రమే కాకుండా, వరుణ్ తేజ్ మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్ కనగరాజు’అనే సినిమా చేస్తున్నారు. ఇది షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీనితో పాటు, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ లో కూడా వరుణ్ ఒక కీలక పాత్ర చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గాయం నుంచి వరుణ్ తేజ్ త్వరగా కోలుకుని, మళ్ళీ షూటింగ్‌లో పాల్గొనాలని మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.






