హెల్త్ అప్డేట్ ఇచ్చిన వరుణ్ తేజ్.. స్ట్రాంగ్‌గా తిరిగొస్తానంటూ కీలక నోట్

by Mallepaka Hamsa |

నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మీ ప్రేమ, సపోర్ట్ నాకు చాలా ముఖ్యం.

హెల్త్ అప్డేట్ ఇచ్చిన వరుణ్ తేజ్.. స్ట్రాంగ్‌గా తిరిగొస్తానంటూ కీలక నోట్
X

దిశ, సినిమా: మోగా హీరో వరుణ్ తేజ్ తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘బరి’ సినిమా కోసం కష్టపడుతున్న సమయంలో ఆయనకు అనుకోని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ మోకాలి ఎముక తీవ్రంగా విరిగింది. దీంతో ఆయనకు వెంటనే ఒక మైనర్ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇక ఈ విషయాన్ని వరుణ్ సోదరి, నిర్మాత నిహారిక కొణిదెల ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన అన్న ఆరోగ్యం గురించి ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. "మా అన్న వరుణ్ తేజ్ ‘భారీ’ సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మోకాలికి తీవ్రమైన గాయమైంది. సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారు. మీ అందరి ప్రేమాభిమానాలు మాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయి" అని ఆమె పేర్కొన్నారు.

తాజాగా, ఇప్పుడు వరుణ్ మళ్ళీ ఓ కీలక నోట్ విడుదల చేశారు. తన హెల్త్ అప్డేట్ ఇస్తూ.. "నా ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మీ ప్రేమ, సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. సర్జరీ బాగా జరిగింది. ఇప్పుడు త్వరగా కోలుకోవడంపైనే నా దృష్టి ఉంది. మునుపటి కంటే ఇంకా బలంగా, రెట్టింపు ఉత్సాహంతో మీ ముందుకు తిరిగి వస్తాను" అని ఆయన ఎంతో కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఈ వార్త విన్న మెగా అభిమానులు గెట్ వెల్ సూన్ వరుణ్ అన్నా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాలీబాల్ క్రీడ నేపథ్యంలో సాగే బరి సినిమా కోసం వరుణ్ చాలా కాలంగా కఠిన శిక్షణ తీసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని నిహారిక కొణిదెల స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. ‘బరి’తో పాటు వరుణ్ ‘కోరియన్ కనకరాజు’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ కోలుకునే వరకు ఈ సినిమాల షూటింగ్స్‌కు చిన్న విరామం లభించింది.

Next Story