సస్పెన్స్ థ్రిల్లర్‌తో వరలక్ష్మి దర్శకురాలిగా ఎంట్రీ.. క్యూరియాసిటీ పెంచేస్తున్న ట్రైలర్

by Mallepaka Hamsa |

ప్రతి అమ్మాయి సరస్వతి లాగా ఉండదు.. అవసరమైతే కాళిగా మారుతుంది.

సస్పెన్స్ థ్రిల్లర్‌తో వరలక్ష్మి దర్శకురాలిగా ఎంట్రీ.. క్యూరియాసిటీ పెంచేస్తున్న  ట్రైలర్
X

దిశ, సినిమా: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా తనదైన నటనతో మెప్పించిన వరలక్ష్మీ శరత్ కుమార్(Varalakshmi Sarath Kumar), ఇప్పుడు సరికొత్త అవతారమెత్తారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం ‘సరస్వతి’(Saraswati). తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఒక సున్నితమైన అంశానికి సస్పెన్స్ థ్రిల్లర్‌ను జోడించి ఆమె ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కథ ఒక చిన్నారి మిస్సింగ్ కేసు చుట్టూ తిరుగుతుంది. ఇందులో సరస్వతి అనే చిన్నారి వరలక్ష్మి కూతురు పాత్రలో నటించింది. తన ప్రాణ సమానమైన కూతురు కనిపించకుండా పోవడంతో, ఆ ఆచూకీ కోసం ఒక తల్లి చేసే పోరాటమే ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించనున్నారు. కూతురిని వెతికే క్రమంలో వరలక్ష్మి ఎదుర్కొన్న సవాళ్లు, ఆమె మారిన తీరు ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగిస్తున్నాయి.

ట్రైలర్ చివరలో వరలక్ష్మి యాక్షన్ మోడ్‌లోకి మారి గన్ పట్టుకుని కనిపించడం హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా, ‘‘ప్రతి అమ్మాయి సరస్వతి లాగా ఉండదు.. అవసరమైతే కాళిగా మారుతుంది’’ అంటూ ఆమె చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఒక సాధారణ తల్లి తన బిడ్డ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతుందనే పాయింట్‌ను ఇందులో బలంగా చూపించారు. కాగా.. ఈ సినిమాలో వరలక్ష్మితో పాటు వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. రావు రమేష్, ప్రియమణి, అభినవ్ గోమటం వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలు పోషించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ ‘సరస్వతి’ ఒక మంచి ట్రీట్ ఇవ్వబోతోందని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.


Next Story