అది డిసైడ్ చేయడానికి మీరెవరూ? నెటిజన్లపై నటి సీరియస్

by Dishanational2 |
అది డిసైడ్ చేయడానికి మీరెవరూ? నెటిజన్లపై నటి సీరియస్
X

దిశ, సినిమా: స్టార్ కిడ్, నటి వరలక్ష్మీ శరత్ కుమార్ సినిమా రివ్యూల విషయంలో నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మధ్యకాలంలో మూవీ రిలీజైనా వెంటనే ప్రతి ఒక్కరూ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో ఇష్టం వచ్చినట్లు రివ్యూలు ఇచ్చేస్తున్నారని మండిపడింది. రీసెంట్‌గా ఓ సమావేశంలో పాల్గొన్న ఆమె.. సినిమా ఆడియన్స్‌కు చేరకముందే కొంతమంది విష ప్రచారం చేస్తున్నారని, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేనివాళ్లు కూడా రివ్యూలు ఇవ్వడం బాధకరమని పేర్కొంది. 'ఈ సినిమాలో ఇది బాలేదు. అది బాలేదు. అని అసలు విషయం చెప్పకుండా ఏవేవో ప్రచారం చేస్తున్నారు. అలాంటి వాళ్లందరినీ ఒకటి అడుగుతున్నా.. అసలు మీరు సినిమాల నుంచి ఏం కోరుకుంటున్నారు? మూవీ అంటే ఎంజాయ్ చేయడం మానేసి నెగెటీవ్ కామెంట్స్ చేయడం పనిగా పెట్టుకున్నారు. అర్థ పర్థం లేకుండా ఎవరికీ వారే రివ్యూలు ఇస్తున్నారు. మూవీ హిట్ లేదా ప్లాఫ్ అని డిసైడ్ చేయడానికి మీరెవరూ? ఒక చిత్రం ఎలావుందో ప్రేక్షకులనే నిర్ణయించనివ్వండి. రివ్యూలు కావాలంటే ఓ వారం ఆగి రాసుకోండి. జీవితం చాలా చిన్నది. ఎంజాయ్ చేయండి. అభిమానులకు సినిమాను చూసి ఆనందించే అవకాశం కల్పించండి. ఇదొక్కటే నా రిక్వెస్ట్' అంటూ చెప్పుకొచ్చింది.



Next Story

Most Viewed