- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాణీజయరాంకు కడసారి కన్నీటి వీడ్కోలు
ప్రముఖ దక్షిణాది సింగర్ వాణీజయరాం అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో వాణిజయరాంకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ దక్షిణాది సింగర్ వాణీజయరాం అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో వాణిజయరాంకు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. బేసంట్ నగర్ శ్మశాన వాటికలో వాణిజయరాం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకముందు వాణీజయరాం నివాసానికి చేరుకుని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నివాళులు అర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ 'వాణీజయరాంకు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డు ప్రకటించింది. దురదృష్టవశాత్తు ఆ అవార్డు తీసుకోకుండానే ఆమె తుదిశ్వాస విడిచారు. వాణీజయరాం కుటుంబ సభ్యులకు, సినీ లోకానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా'అని స్టాలిన్ చెప్పారు. కాగా, శనివారం చెన్నైలోని తన నివాసంలో వాణీజయరాం తుదిశ్వాస విడిచారు. వాణీజయరాం మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.
READ MORE
Next Story






