- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళంలో మరో బంపర్ ఆఫర్ దక్కించుకున్న వైష్ణవి చైతన్య!
హీరోగా, నిర్మాతగా, అలాగే టాప్ సంగీత దర్శకుడిగా సౌత్ ఇండస్ట్రీలో తీరిక లేకుండా గడుపుతున్న విలక్షణ నటుడు జీవీ ప్రకాష్ కుమార్ సరసన ఆమె హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం.

దిశ, సినిమా: ‘బేబీ’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వైష్ణవి చైతన్య వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో నటిస్తూ తన పాపులారిటీని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా అవకాశాలు క్యూ కడుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ భామ, ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా క్రేజీ ప్రాజెక్ట్‌లపై సంతకాలు చేస్తూ తన పాపులారిటీని మరింతగా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో ఆనంద్ దేవరకొండ సరసన మరోసారి ‘ఎపిక్’ చిత్రంలో నటిస్తుండగా.. తమిళంలో ఆర్య-40 మూవీలోనూ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇలాంటి సమయంలో వైష్ణవి చైతన్య ఖాతాలో మరో భారీ బంపర్ ఆఫర్ చేరినట్లు వార్తలు వస్తున్నాయి. హీరోగా, నిర్మాతగా, అలాగే టాప్ సంగీత దర్శకుడిగా సౌత్ ఇండస్ట్రీలో తీరిక లేకుండా గడుపుతున్న విలక్షణ నటుడు జీవీ ప్రకాష్ కుమార్ సరసన ఆమె హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం.
ప్రస్తుతం జీవీ ప్రకాష్ టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేష్ కార్తీక్ దర్శకత్వంలో ఒక వైవిధ్యమైన సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా ఇప్పటికే చెన్నైలో విజయవంతంగా పూర్తయింది. అయితే త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్‌లో వైష్ణవి చైతన్య కూడా చిత్ర యూనిట్‌తో జాయిన్ కాబోతున్నట్లు టాక్. కథ వినగానే క్యారెక్టర్‌లోని నటనకు ఉన్న ప్రాధాన్యత నచ్చి వైష్ణవి వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. జీవీ ప్రకాష్ సినిమాల్లో కంటెంట్‌తో పాటు పాటలకు కూడా మంచి స్కోప్ ఉంటుంది. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో వైష్ణవికి ఛాన్స్ రావడం ఆమె కెరీర్‌కు ప్లస్ కానుందని నెట్టింట చర్చించుకుంటున్నారు. ఇక తమిళంలో బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటున్న వైష్ణవి చైతన్య రేంజ్ మారిపోయే కాలం దగ్గర పడిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.






